ప్రముఖ హీరో ఇంటిపై ఐటీ దాడులు !

ప్రముఖ హీరో ఇంటిపై ఐటీ దాడులు !

Published on Sep 30, 2018 4:43 PM IST

vijay sethupathi

తమిళ్లో ఏడాదికి 5 లేదా 6సినిమాలు చేస్తూ బిజీ స్టార్ హీరో గా మారాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి . అక్క ఆయనకు చాలా మంది అభిమానులున్నారు. ఒక్కో సినిమాకు భారీ పారితోషికాన్ని తీసుకుంటాడు విజయ్. ఇక దాంతో ఐటీ అధికారాల చూపు ఆయన పై పడింది. తాజాగా విజయ్ సేతుపతి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారాలు సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఆయన ఆస్తుల గురించి ఏ విషయం ఇంకా బయటకురాలేదు. ఇక ఈ సోదాలు జరుగుతున్నపుడు విజయ్ షూటింగ్ లో వున్నాడు.

ఇక విజయ్ ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న ‘సైరా’ అలాగే సూపర్ స్టార్ రజినీ నటిస్తున్న ‘పెట్టా’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ’96’ అక్టోబర్ 4న విడుదలకు సిద్దమవుతుంది.

తాజా వార్తలు