అభిమానితో పెళ్లి పై ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అన్న అక్కినేని సమంత

Published on Jul 29, 2018 10:59 am IST

ఓ అమ్మాయి పై చిన్న నెగిటివ్ కామెంట్ చేస్తేనే ఆ అమ్మాయి చాలా సీరియస్ అయిపోతుంది. అలాంటిది ఏకంగా ఓ స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్నట్లుగా ఫోటో ఎడిట్ చేసి పబ్లిక్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ఆ హీరోయిన్ ఇంక ఎలా రియాక్ట్ అవ్వాలి ? పోస్ట్ చేసిన వ్యక్తి పై ఈ పాటికే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అతని పై యామా సీరియస్ అవుతూ నానా హంగామా చేసేది. కానీ ఇక్కడ సమంత కదా. ఓ అభిమాని తనని పెళ్లి చేసుకున్నట్లుగా ఫోటో ఎడిట్ చేసి పోస్ట్ చేసినా సామ్ మాత్రం ఆ ఫోటో పై చాలా సరదాగా స్పందించింది.

‘లాస్ట్ వీక్ నేను పారిపోయాను.. అసలు ఇది ఎలా లీక్ అయిందో అర్ధం కావట్లేదు.. ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్’’ అంటూ పోస్ట్ చేస్తూ తన అభిమానులకు తన సెన్సాఫ్ హ్యూమర్‌ ని చూపించింది. మరి ఈ ఫోటో అక్కినేని నాగ చైతన్య చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో ?

సంబంధిత సమాచారం :