మహేష్ కి కథ రాయడం కష్టం అంటున్న ‘బాహుబలి’ రచయిత.!

Published on Jun 1, 2021 10:00 am IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి అగ్ర హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మరి అలాంటి మహేష్ నుంచి ఒక పాన్ ఇండియన్ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో దర్శక దిగ్గజం రాజమౌళితో కాస్త ఆలస్యం అయినా అనౌన్స్ చేసేసారు. అయితే అసలు మహేష్ కి కథ రాయడమే కష్టం అంటున్నారు బాహుబలి లాంటి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ కి కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు.

రాజమౌళి ప్రతి సినిమాకు కథ అందించే ఆయన ఈటీవీలో ప్రసారం అయ్యే ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో ఈ మాటను చెప్పారు. మహేష్ కి కథ రాయడం చాలా టఫ్ జాబ్ అని తెలిపారు. అలాగే మహేష్ కి కథ రాయాలి అంటే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సలహా తీసుకోవాలని నవ్వుతూ అనేసారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే రాజమౌళితో తీయబోయే సినిమాకు కూడా ఆయనే కథ ఇస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సెన్సేషనల్ కాంబో మహేష్ కటౌట్ కి ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :