అఫీషియల్ : 1000 కోట్ల క్లబ్ లో రాకింగ్ హిట్ “కేజీయఫ్ చాప్టర్ 2”

Published on May 4, 2022 2:30 pm IST


ఈ ఏడాదిలో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి భారీ హిట్ గా నిలిచిన మరో బిగ్గెస్ట్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనేక అంచనాలు రీచ్ అయ్యి అన్ని భాషల్లో కూడా భారీ వసూళ్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం నిలిచింది.

అయితే ఈ సినిమా రెస్పాన్స్ చూసి మన తెలుగు సినిమా “రౌద్రం రణం రుధిరం” తర్వాత ఇది కూడా 1000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను అందుకుంటుంది అని అంతా అభిప్రాయ పడ్డారు. మరి ఆ అంచనాలు నిజం చేస్తూ ఈ చిత్రం రికార్డు వసూళ్లతో ఈ సెన్సేషనల్ మార్క్ ని నిన్నటి ఈద్ తో క్రాస్ చేసినట్టుగా అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది.

ఇప్పటికీ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ మంచి రన్ తో అన్ని భాషల్లోని కొనసాగుతుంది మరి ఫైనల్ రన్ లో అయితే ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా రవి బసృర్ సంగీతం అందించాడు. అలాగే హోంబలె ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :