ఆఫీషియల్..పవన్ రానా చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అతనే.!

Published on Jul 28, 2021 7:32 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ప్రాజెక్ట్స్ లో దర్శకుడు సాగర్ చంద్ర తో తీస్తున్న మాస్ రీమేక్ కూడా ఒకటి. నిన్ననే మంచి మేకింగ్ వీడియో కట్ తో వచ్చి మరింత హైప్ ని తెచ్చుకున్న ఈ చిత్రం కు సంబంధించి ముందుగా ఫిక్స్ అయిన సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెళ్ళ పలు కారణాల చేత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

మరి ఆయన స్థానంలో మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ని మేకర్స్ రంగంలోకి దింపనున్నారని ఆ మధ్య మేము తెలిపాము. మరి ఇప్పుడు అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. నిన్న మేకింగ్ వీడియోని కోట్ చేస్తూ రవి కె చంద్రన్ తన కొత్త జర్నీ స్టార్ట్ అయ్యినట్టుగా ట్వీట్ చేసారు.

దీనితో ఈ సినిమాకి కొత్త సినెమాటోహాగ్రఫీ తానే అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇప్పటికే అయన అనేక బాలీవుడ్ మరియు తమిళ సినిమాలు షూట్ చేశారు. మరి ఈ మాస్ ఎంటర్టైనెర్ కి ఎలాంటి విజువల్స్ చూపనున్నారో చూడాలి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :