అది బాలయ్య బాబు లైఫ్ లోనే బెస్ట్ స్పీచ్ అంటా !

Published on Jan 6, 2019 1:01 am IST

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పటికే కథానాయకుడు ప్రమోషన్స్ ను చిత్రబృందం వేగవంతం చేసింది. కాగా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం ఓ ఇంటర్వ్యూని విడుదల చేసింది. ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ.. ఓ వేడుకలో ఏఎన్నార్ గురించి తానూ చెప్పిన స్పీచ్ నే తన జీవితంలో బెస్ట్ స్పీచ్ అని తెలిపారు.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ – ఏఎన్నార్ ల మధ్య అనుబంధాన్ని చూపించనున్నారు. ఇద్దరు చివరి దశ వరకు కలిసి ప్రయాణించారు. అలాగే మంచి చెడ్డలను కలిసి పంచుకుంటూ సోదర భావంతో ఇద్దరూ చివరవరకు కలిసే మెలిగారు. ఆ విశేషాలను ఈ బయోపిక్ లో చూపించనున్నారు.

బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More