భార్య పేరు పచ్చబొడిపించుకున్న నందమూరి హీరో!

kalyan-ram-m
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చాలా తక్కువగా పంచుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఆయన తన సినిమాల గురించే మాట్లాడుతూ, వ్యక్తిగత జీవితాన్ని వీలైనంతగా తన ప్రైవసీ దాటనివ్వారు. అయితే తాజాగా ఆయన తనకు భార్యపై ఉన్న ప్రేమ ఎంతటిదో తెలియజేస్తూ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. కళ్యాణ్ రామ్ కొద్దికాలం క్రితం తన భార్య స్వాతి పేరును చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నారట.

అన్నివిధాలా తనకు అండగా నిలబడుతూ ఉండే తన భార్య పేరును, పచ్చబొడిపించుకోవడం ద్వారా ఆమె ఎప్పుడూ పక్కనే ఉన్నట్లు ఉంటుందని, ఆమెకు ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తుంటానని కళ్యాణ్ రామ్ ‘ఇజం’ ప్రమోషన్స్‌లో సినిమా గురించి మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి కాస్త ఇలా పంచుకున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ కమర్షియల్ సినిమా అయిన ఇజం అక్టోబర్ 21న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.