వచ్చే వారం “జబర్దస్త్” అంతకు మించి ప్లాన్..!

Published on Aug 13, 2021 1:30 am IST

బుల్లి తెరపై నవ్వులు పూయించే కార్యక్రమాలుగా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చే ఈ నవ్వుల కార్యక్రమాలు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే తాజాగా వచ్చే వారానికి సంబంధించి “జబర్దస్త్” ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో చూస్తుంటే వచ్చే వారం జబర్దస్త్‌ని అంతకు మించి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే పవర్ ఫుల్ పంచెస్‌తో హైపర్ ఆది ఎప్పటిలాగానే తనదైన స్టెయిల్‌లో చెలరేగిపోగా, నారప్ప గెటప్‌లో రాకెట్ రాఘవ అలరించాడు. పోలీస్ డ్రెస్ వేసిన చలాకి చంటి సింగం మాదిరిగా రెచ్చిపోయాడు. ఇక చివరలో అదిరే అభి తన స్కిట్‌తో అలరిస్తూనే మంచి మెసేజ్ అందించాడు. మరి వచ్చే వారం అంతకుమించి ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే ఆగష్టు గురువారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్‌ను ఖచ్చితంగా చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :