వచ్చే వారం జబర్దస్థ్‌లో ఫుల్‌డోస్ ఎంటర్‌టైన్మెంట్..!

Published on Jul 3, 2021 1:26 am IST


ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చే నవ్వుల కార్యక్రమాలు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ప్రస్తుతం బుల్లి తెరపై నంబర్‌వన్ ప్రోగ్రాంగా, నవ్వులు పండించే కార్యక్రమాలుగా మంచి పేరు సంపాదించుకున్నాయి. అయితే ఇందులోని కంటెస్టెంట్లు తమ సరికొత్త స్కిట్లతో, పంచ్ డైలాగ్‌లతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు కడుపుబ్బా నవ్విస్తుంటారు.

అయితే తాజాగా వచ్చే వారానికి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో చూస్తుంటే వచ్చే వారం జబర్దస్త్‌లో ఫుల్‌డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అనిపిస్తుంది. హైపర్ ఆది, అదిరే అభి, వెంకీ మంకీ, చలాకీ చంటీ, రాకెట్ రాఘవ ఇలా అందరూ చేసిన స్కిట్స్ నవ్వులు పూయించేలా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్‌ను మిస్ కాకుండా చూడాలంటే వచ్చే గురువారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీని చూసేయాల్సిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :