OTT : నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన రెండు భారీ చిత్రాలు

OTT : నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన రెండు భారీ చిత్రాలు

Published on May 8, 2025 12:00 AM IST

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం కూడా పలు క్రేజీ సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక ఈ క్రమంలో తాజాగా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రెండు భారీ చిత్రాలు నేటి(మే 8) నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇందులో ఒకటి టాలీవుడ్ మూవీ ‘జాక్’.. మరొకటి తమిళ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’.

తెలుగు హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ ‘జాక్’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమా నేటి నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

తమిళ హీరో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు అదిక్ రవిచంద్రన్ పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సాలిడ్ వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా కూడా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇలా ఒకే రోజు రెండు భారీ చిత్రాలను స్ట్రీమింగ్‌కు తీసుకురావడంతో నెట్‌ఫ్లిక్స్‌లో వీటిని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

జాక్ సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

గుడ్ బ్యాడ్ అగ్లీ సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు