‘జాక్’ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ !

‘జాక్’ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ !

Published on May 5, 2025 8:00 PM IST

JACK

సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య కలయికలో వచ్చిన చిత్రం ‘జాక్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాగా తాజాగా ఈ చిత్రం ఓటీటీ వేదికగా వినోదాన్ని పంచేందుకు రెడీ అయింది. మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కాబోతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది.

కాగా తాజాగా ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా తెలియజేసింది. సిద్ధూ జొన్నలగడ్డ జాక్ గా మంచి పెర్ఫార్మన్స్ ని కనబరిచాడు. అలాగే తన రోల్ లో మంచి హ్యాండ్సమ్ గా చాలా కాన్ఫిడెన్స్ గా తన మార్క్ కామెడీ టైమింగ్ తో అలరించాడు. అటు వైష్ణవి కూడా తన రోల్ లో బాగా చేసింది. సిద్ధుకి తనకి నడుమ కొన్ని సీన్స్ మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా సాగాయి. మరి ఓటీటీలో ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు