లవర్ బాయ్ మాస్ హీరోగా మెప్పిస్తాడా.?

లవర్ బాయ్ మాస్ హీరోగా మెప్పిస్తాడా.?

Published on Jun 24, 2015 7:52 PM IST

jadugadu
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ లాంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ ద్వారా లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో నాగ శౌర్య. నాలు సినిమాల అనుభవం ఉన్న నాగ శౌర్య మొదటి సారిగా చేసిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జాదూగాడు’. ‘చింతకాయల రవి’ ఫేం యోగేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 26న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగానే సాగుతున్నాయి.

ఇన్ని రోజులు లవర్ బాయ్ గా ప్రేక్షకులను మెప్పించి కాస్త గుర్తింపు తెచ్చుకున్న నాగ శౌర్య ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసాడు. మరి మాస్ హీరోగా మెప్పిస్తాడా.? లేదా.? అన్నది ఇక్కడి ప్రశ్న.. ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు మరియు ట్రైలర్స్ లో అతని పెర్ఫార్మన్స్ ని బట్టి మాస్ ని కూడా మెప్పిస్తాడనే అంటున్నారు. మరి అందరూ చెబుతున్నట్టు మాస్ హీరోగా కూడా హిట్ కొడతాడా.? లేదా అన్నది తెలియాలంటే మరొక రోజు ఆగాల్సిందే. సొనారిక బడోరియా హీరోయిన్ గ పరిచయం అవుతున్న ఈ సినిమాకి వివిఎన్ ప్రసాద్ నిర్మాత. అలాగే ఈ మూవీ ద్వారా మణిశర్మ తనయుడు సాగర్ మహతి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.

తాజా వార్తలు