‘వదలా’ టీజర్ టాక్ : ఆసక్తిని రేకెత్తిస్తున్న జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్

‘వదలా’ టీజర్ టాక్ : ఆసక్తిని రేకెత్తిస్తున్న జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్

Published on Mar 11, 2026 2:30 PM IST

1 2

తనదైన వెర్సటైల్ యాక్టింగ్‌తో ఆకట్టుకునే జగపతి బాబు పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘వదలా’ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో లయ హీరోయిన్‌గా నటిస్తుండగా హృతిక శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల మరియు తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేసింది.

ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. జగపతి బాబు, లయ మరోసారి ఈ మూవీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ‘మీ కుటుంబంలో ఎవరో ఒకరు చావాల్సిందే’ అంటూ సాగే డైలాగ్ ఈ సినిమాలో ఎలాంటి థ్రిల్ ఉండబోతుందో చెబుతోంది. ఉత్కంఠ రేపే యాక్షన్ సన్నివేశాలు మరియు ఎమోషనల్ మూమెంట్స్ కలబోసి దర్శకుడు ఆకెళ్ల వి.కృష్ణ ఈ టీజర్‌ను గ్రిప్పింగ్‌గా కట్ చేశారు.

ఇక ఈ సినిమాకు చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ మూడ్‌ను ఎలివేట్ చేయగా, కార్తీక్ కొడకండ్ల అందించిన బీజీఎం టెన్షన్ క్రియేట్ చేస్తుంది. మొత్తానికి ‘వదలా’ అంటూ వస్తున్న జగపతి బాబు, లయ ఈ సారి ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు