వై ఎస్ రాజారెడ్డి గా జగపతిబాబు !

Published on Jan 3, 2019 12:25 pm IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి , దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యాత్ర’. మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలోనటిస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం నుండి ప్రముఖ నటుడు జగపతి బాబు లుక్ ను విడుదలచేశారు. ఈ చిత్రంలో ఆయన వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదలకానుంది.

ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ ,సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇక ఈచిత్రం బాక్సాఫిస్ వద్ద ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ తో పోటీపడనుంది. ఈరెండు కూడా బయోపిక్ సినిమాలే కావడం విశేషం.

సంబంధిత సమాచారం :