చిరు క్రేజీ ప్రాజెక్ట్ లో జగ్గూభాయ్ కీలక రోల్?

Published on Jul 2, 2020 3:00 am IST


జగ్గూభాయ్ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఒకప్పటి ఫ్యామిలీ చిత్రాల హీరో… విలన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆయన సౌత్ లోని అన్ని పరిశ్రమలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. మంచి ఆహార్యం కలిగిన జగపతిబాబు…క్లాస్ మరియు మాస్ అన్ని రకాల పాత్రలకు సెట్ అవుతాడు. కాగా జగపతి బాబు ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సుజీత్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా లూసిఫర్ తెలుగు రీమేక్ తెరకెక్కనుంది. దర్శకుడు సుజీత్ కొంత కాలంగా ఈ స్క్రిప్టుపై పనిచేస్తున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ లో జగపతి బాబు ఓ కీలక రోల్ చేయనున్నాడట. ఈ విషయమై వీరి మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరినట్టు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More