మహేష్ 26లో విలన్ ఎవరంటే !

Published on Apr 23, 2019 11:02 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తరువాతి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో చేయనున్నాడని తెలిసిందే. ఈచిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు విలన్ రోల్ లో నటించనున్నాడు. కాగా మహేష్ తో కలిసి నటించడం జగపతి బాబు కు ఇది మూడోసారి. ఇంతకుముందు ఆయన శ్రీమంతుడులో మహేష్ కు తండ్రి పాత్రలో నటించగా ప్రస్తుతం మహర్షి లో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఈచిత్రాన్ని కూడా అనిల్ రావిపూడి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించనుండగా విజయశాంతి , బండ్ల గణేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు , అనిల్ సుంకర కలిసి నిర్మించనున్న ఈ చిత్రం మే లాంచ్ అయ్యి జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివారాలు వెలుబడనున్నాయి.

ఇక మహేష్ నటించిన మహర్షి షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రం మే 9న గ్రాండ్ గా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :