సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ లో సినీప్రముఖులు సమక్షంలో గ్రాండ్ గా జరింగింది. కాగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతిబాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారట. సెకండ్ షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో హీరో జగపతి బాబు ఈ షెడ్యూల్ నందు పాల్గొననున్నారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అంతేకాదు గల్లా అశోక్, జగపతిబాబు ఫొటోను విడుదల చేసింది.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. గల్లా అశోక్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు.


