జగ్గూ భాయ్ ఫిలాసఫీ అదిరిందిగా..!

Published on Jan 31, 2020 9:00 pm IST

సౌత్ ఇండియాలోనే క్రేజీ విలన్ గా కొనసాగుతున్న జగపతి బాబు ట్విట్టర్ ద్వారా సూపర్ ఫిలాసఫీ చెప్పారు. ”ఇతరుల దగ్గర ఏముందా అని చూడకూ… నీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందు, పెద్ద లక్ష్యాల వైపు చూడు” అని గొప్ప జీవిత సత్యం చెప్పారు. ఇండస్ట్రీలో ప్రతివారు హిపోక్రసితో బ్రతికేస్తారు. ఎదుటి వారు మన గురించి ఏమనుకుంటున్నారో… అనే భావనతో ఉంటారు. దీనికి భిన్నంగా జగపతి బాబు వ్యక్తిత్వం ఉంటుంది. ఏ విషయం గురించైనా ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టడం ఆయన ప్రత్యేకత. వ్యకిగత విషయాలు కూడా ఆయన దాచుకోరు.

ఒక పెద్ద నిర్మాత కొడుకుగా పరిశ్రమకు పరిచయమైన జగపతి బాబు ఫ్యామిలీ చిత్రాల హీరోగా టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా కెరీర్ ముగిసిన వెంటనే విలన్ గా మారి మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా ఎదిగారు. ఆరడుగుల ఆహార్యం, మంచి ఫిజిక్ మైంటైన్ చేసే జగపతి బాబు అటు క్లాస్ ఇటు మాస్ పాత్రలకు చక్కగా సరిపోతారు. ప్రస్తుతం జగపతి బాబు సౌత్ లోని అన్ని భాషల సినిమాలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :