సరికొత్త రికార్డ్ సృష్టించిన సూర్య ‘జై భీమ్‌’ మూవీ..!

Published on Nov 10, 2021 2:43 am IST


తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జై భీమ్‌’. ఈ నెల 2వ తేదిన అమెజాన్‌ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ సినిమాల జాబితాలో ‘జై భీమ్‌’ టాప్‌-1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

అయితే 53 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్‌తో జై భీమ్‌ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఇప్పటివరకు తొలిస్థానంలో 1994లో విడుదలైన “ది షాషాంక్ రిడంప్షన్‌” ఉండగా ఇప్పుడు ఆ సినిమాను రెండో స్థానానికి నెట్టిన్q ‘జై భీమ్‌’ తొలి స్థానాన్ని దక్కించుకుంది.

సినిమాల రేటింగ్:

* జై భీమ్‌ – 9.6/10
* ది షాషాంక్ రిడంప్షన్ – 9.3
* ది గాడ్‌ ఫాదర్‌ – 9.2
* ది డార్క్‌ నైట్‌ – 9.0
* ది డార్క్‌ ఫాదర్ – పార్ట్‌ 2

సంబంధిత సమాచారం :

More