నవంబర్ 2 వ కి సూర్య ” జై భీమ్” ప్రైమ్ లో విడుదల!

Published on Oct 1, 2021 5:00 pm IST

విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తున్న తమిళ నటుడు సూర్య, సరికొత్త కథాంశం తో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు. కోర్ట్ రూమ్ సన్నివేశాలతో న్యాయవాది గా నటిస్తున్న సూర్య కొత్త చిత్రం జై భీమ్. ఈ చిత్రం టైటిల్ ను ప్రకటించినప్పటి నుండి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో సూర్య విభిన్నం గా కనిపిస్తున్నారు. సూర్య తో పాటుగా ఈ చిత్రం లో రజిష, విజయన్, లిజామొల్ జోస్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు.

2D ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని సూర్య మరియు జ్యోతిక లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన విడుదల తేదీను చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. నవంబర్ 2 వ తేదీన ఈ చిత్రం ను విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ తో వెల్లడించడం జరిగింది. ఈ చిత్రానికి సీన్ రోల్దన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :