
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “జైలర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం భారీ అంచనాలు నడుమ వచ్చి సెన్సేషనల్ హిట్ కాగా ఇప్పుడు భారీ వసూళ్లతో అదరగొడుతుంది. ఇక ఈ చిత్రం మన తెలుగు స్టేట్స్ లో కూడా మాసివ్ వసూళ్లు రాబడుతూ ఉండగా ఈ ఏడాది డబ్బింగ్ చిత్రాల్లో హైయెస్ట్ వసూళ్ళని రాబట్టి మరింత స్ట్రాంగ్ గా అయితే దూసుకెళ్తుంది.
ఇక వరల్డ్ వైడ్ కూడా సెన్సేషనల్ రన్ లోకి వెళుతున్న ఈ చిత్రం లేటెస్ట్ గా అయితే ఏకంగా 350 కోట్ల భారీ వసూళ్ల మార్క్ ని ఇది అందుకున్నట్టుగా తెలుస్తుంది.. దీనితో జైలర్ హవా ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో తమన్నా సునీల్ లు ముఖ్య పాత్రల్లో నటించగా శివ రాజ్ కుమార్ అలాగే మోహన్ లాల్ లు పవర్ ఫుల్ క్యామియో పాత్రల్లో అయితే నటించారు.