కామెడీ కింగ్ అల్లరి నరేష్ సినిమాలంటే కామెడీకి పెద్ద పీట వేస్తారు. కామెడీని తనదైన స్టైల్లో ప్రెజెంట్ చేస్తూ, తన బ్రాండ్‌ను మరింత పెంచుకుంటూ వచ్చిన నరేష్ ‘సుడిగాడు’ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. తాజాగా అల్లరి నరేష్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘జేమ్స్ బాండ్’ ఆ లోటును తీర్చే సినిమా అని చెప్పుకోవచ్చు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం పరిచయమయ్యారు.
జూలై 24న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అంతే కాకుండా ప్రతి ఏరియాలోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. మాకు అందిన సమాచారం ప్రకారం సెకండ్ వీకెండ్ కూడా జేమ్స్ బాండ్ కి స్ట్రాంగ్ కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ వీకెండ్ పూర్తయ్యే లోపు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అంతా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతారని సమాచారం. జేమ్స్ బాండ్.. ‘నేను కాదు నా పెళ్ళాం’ అన్న ట్యాగ్‌లైన్‌తో వచ్చిన సినిమాలో సాక్షి చౌదరి అల్లరి నరేష్‌ను ఇబ్బందుల్లో పడేసే భార్యగా నటించింది. సుడిగాడు తర్వాత అల్లరి నరేష్ కెరీర్‌కు మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టిన సినిమా ఇదే కావడం విశేషం. ఇటీవల నిర్వహించిన సక్సెస్ టూర్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.


