ఇళయ దళపతి అలాగే ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా యంగ్ బ్యూటీ మమితా బైజు కీలక పాత్రలో దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే జన నాయగన్. తెలుగు జన నాయకుడు గా ప్లాన్ చేసిన ఈ భారీ సినిమా బాలయ్య భగవంత్ కేసరికి రీమేక్ గా తీశారు.
అయితే ఈ సినిమా విడుదలకి అనేక ఆటంకాలు ఎదురు కాగా ఫైనల్ గా మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి అప్డేట్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఈ జూలై 24 తేదీన సినిమా విడుదల కానుంది అని వారు కన్ఫర్మ్ చేశారట. సో ఇది విజయ్ అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి తమిళ్ వెర్షన్ వరకూ మాత్రమే అప్డేట్ అయినట్టు తెలుస్తుంది. తెలుగు, హిందీ వెర్షన్ లపై మరింత క్లారిటీ రావాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహించారు.


