‘పెద్ది’ నుంచి మాస్ అచ్చియ్యమ్మ.. జాన్వీ బర్త్ డే పోస్టర్ వైరల్!

peddi 3

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా హీరోయిన్ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కించిన సాలిడ్ చిత్రమే “పెద్ది”. అయితే ఈ సినిమా జాన్వీ కపూర్ కి మన తెలుగులో రెండో సినిమా కాగా దీనిపై కూడా భారీ హైప్ ఉంది. దేవర చిత్రం లానే ఇందులో కూడా ఈమెకి మంచి గ్లామరస్ పాత్ర దక్కింది. ఆల్రెడీ సాంగ్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ తో మేకర్స్ జాన్వీ రోల్ ని అచ్చియమ్మ అంటూ పక్కా ఉత్తరాంధ్ర పాత్రని పరిచయం చేశారు.

ఇక నేడు ఆమె బర్త్ డే కానుకగా మరో క్రేజీ పోస్టర్ ని వదిలారు. ఇక ఇందులో కూడా ఆమె మంచి గ్లామరస్ గానే కనిపిస్తుంది. చీర లేకుండా, కళ్లద్దాలు పెట్టుకుంటున్న ఓ చిలిపి అమ్మాయిగా ఇందులో కనిపిస్తుంది. దీనితో మేకర్స్ వదిలిన ఈ బర్త్ డే స్పెషల్ పోస్టర్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

Exit mobile version