దుల్కర్ ప్లేస్ ను రీప్లేస్ చేసిన బాలీవుడ్ యాక్టర్ !

జాన్వీ కపూర్ రీసెంట్ గా తన మూడవ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసిందే. ఆమె మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ చిత్రంలో నటించనుంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కి జోడిగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. ఈ వార్తలు కేవలం రూమర్లు మాత్రమే అని ఈచిత్రంలో జాన్వీ కి జోడిగా ప్రముఖ హిందీ నటుడు అంగద్ బేడీ నటించనున్నారని తెలిపింది. అంగద్ ఇటీవల ‘సూర్మ , టైగర్ జిందా హై ‘చిత్రాల్లో నటించి మంచి మార్కులు కొట్టేశాడు.

కరణ్ జోహార్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక మొదటి చిత్రం ‘దఢక్’ తో సూపర్ హిట్ కొట్టిన జాన్వీ ప్రస్తుతం ‘తక్త్’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తుంది.

Exit mobile version