బయోపిక్ కోసం బరువు పెరుగుతున్న జాన్వీ !

Published on Jan 31, 2019 3:37 am IST

గత ఏడాది దఢక్ చిత్రం తో సూపర్ హిట్ కొట్టి బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది యువ హీరోయిన్ జాన్వీ కపూర్. ఇక ఈ చిత్రం తరువాత జాన్వీ ప్రస్తుతం రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఒకటి మల్టీ స్టారర్ చిత్రం తక్త్ కాగా రెండవది మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ చిత్రం. కాగా జాన్వీ మొదటగా ఈ బయోపిక్ లోనే నటించనుంది.

ఇక ఈ చిత్రం కోసం జాన్వీ 7కిలోలు బరువు పెరగనుందట అలాగే ఈ చిత్రం కోసం జాన్వీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ కూడా తీసుకుంటుంది. ఫిబ్రవరిలో కానీ మార్చి లో కానీ ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :