జాన్వీ కి జోడిగా మలయాళ స్టార్ హీరో ?

Published on Dec 13, 2018 12:58 am IST


జాన్వీ కపూర్ మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ చిత్రంలో నటించనుందని తెలిసిందే. ఈ సినిమా గురించి జాన్వీ , గుంజన్ ను కలసి ఆమె దగ్గర నుండి సలహాలు కూడా తీసుకుంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కి జోడిగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే హిందీ లో ఈ చిత్రం ఆయనకు మూడవ చిత్రం కానుంది. ఇంతకుముందు ‘కార్వా’ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ ప్రస్తుతం అక్కడ ‘ది జోయా ఫ్యాక్టర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఇక గుంజన్ 1999 కార్గిల్ యుద్ధంలో గాయపడిన సైనికులను తన యుద్ధ విమానంలో ఎక్కించుకుని ప్రశంసలు పొందింది. కరణ్ జోహార్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. ఇటీవల ‘దఢక్’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన జాన్వీ ప్రస్తుతం ‘తక్త్’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతుంది.

సంబంధిత సమాచారం :