జాన్వీ ఫిట్ నెస్ ఫీట్ చూస్తే కళ్ళుతిప్పుకోలేరు

Published on Aug 17, 2019 1:05 pm IST

అందాల నటి శ్రీదేవి, ప్రొడ్యూసర్ బోని కపూర్ ల సినీ వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేశారు జాన్వీ కపూర్.ఆమె తన మొదటి చిత్రంగా ధఢక్ లో నటించి మంచి మార్కులే కొట్టేశారు. కాగా ఆమె నటిస్తున్న రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. కాగా ఈ బ్యూటీ ఫిట్నెస్ పై చాలా శ్రద్ద తీసుకుంటారు. తరచుగా ఆమె జిమ్ దుస్తులలో పబ్లిక్ ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తరాలకు ఫిట్నెస్,పర్ఫెక్ట్ బాడీ అనేది చాలా ముఖ్యమైన విషయం అనేది అందరికి తెలిసిందే.

కాగా తన జిమ్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ తో ఆమె ఓ ఫిట్నెస్ ఫీట్ లో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆఫొటో చూసిన ఆమె అభిమానులు జాన్వికి ఇంత ఫిట్నెస్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. జాన్వీ ప్రస్తుతం నటిస్తున్న కార్గిల్ గర్ల్, రూహ్ ఆఫ్జా చిత్రీకరణ దశలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం :