సమీక్ష : “జపాన్” – అక్కడక్కడా ఒకే అనిపించే క్రైమ్ కామెడీ

సమీక్ష : “జపాన్” – అక్కడక్కడా ఒకే అనిపించే క్రైమ్ కామెడీ

Published on Nov 11, 2023 3:04 AM IST
Japan Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 10, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, జితన్ రమేష్, విజయ్ మిల్టన్, కె ఎస్ రవి కుమార్

దర్శకుడు : రాజు మురుగన్

నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు మరియు ఎస్ ఆర్ ప్రభు

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: ఎస్ రవి వర్మన్

ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా “జపాన్”. మరి దీపావళి కానుకగా తెలుగు మరియు తమిళ్ లో మంచి బజ్ తో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎంతమేర ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..జపాన్ ముని(కార్తీ) ఇండియా లోనే ఓ పేరు మోసిన గజదొంగ కాగా తాను ఎక్కువగా బంగారం మాత్రమే దొంగతనం చేస్తూ ఉంటాడు. అలా ఓ రోజు హైదరాబాద్ లో రాయల్ జ్వలర్స్ లో 200 కోట్లు విలువ చేసే భారీ బంగారు దోపిడీ జరుగుతుంది. మరి ఇదంతా జపాన్ ప్యాట్రన్ లో ఉందని పోలీసులు రంగం లోకి దిగుతారు. వారిలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీధర్(సునీల్) ఒక వైపు ఇంకోపక్క మరో పోలీస్ భవాని(విజయ్ మిల్టన్) రంగంలోకి దిగుతారు. ఇక అక్కడ నుంచి వారు జపాన్ ని పట్టుకున్నారా లేదా? అసలు ఆ దొంగతనం వెనుక ఉంది నిజంగా జపాన్ మాత్రమేనా లేక ఇంకా వేరే ఎవరన్నా ఉన్నారా అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూసి తెలుసుకోవాలి.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ అసలు కార్తీ పాత్ర అని చెప్పాలి. దానిని చాలా డిఫరెంట్ గా దర్శకుడు ప్రెజెంట్ చేస్తే దానిని అంతకు మించిన స్పెషల్ గా అయితే కార్తీ తన విలక్షణ నటనతో రక్తి కట్టించాడు అని చెప్పాలి. తాను ఇప్పటికే సర్ధార్ లో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించినప్పటికీ ఇందులో జపాన్ పాత్ర తన కెరీర్ లో మరింత స్పెషల్ రోల్ గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అంతే కాకుండా జపాన్ లా తన మాట నడవడిక మంచి ఫన్ ని జెనరేట్ చేస్తాయి.

ఇక అలాగే సినిమాలో యాక్షన్ బ్లాక్ లు అక్కడక్కడా కొన్ని కామెడీ బిట్స్ బాగున్నాయి. అంతే కాకుండా నటుడు సునీల్ మరోసారి కోలీవుడ్ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ పాత్ర చేసి షైన్ అయ్యాడని చెప్పవచ్చు. అలాగే తనతో పాటుగా భవాని పాత్రదారుడు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక క్లైమాక్స్ లో చిన్న ఎమోషనల్ బిట్ ఓకే అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇక ఈ చిత్రంలో డిజప్పాయింట్ చేసే అంశాలు విషయానికి వస్తే సినిమాలో అంత గొప్ప నరేషన్ ఏం కనిపించదు. దర్శకుడు జపాన్ అనే ఒక యూనిక్ పాత్రని డిజైన్ చేసుకున్నాడు కానీ దానిని చాలా లిమిటెడ్ గా ప్రెజెంట్ చేసినట్టు అనిపిస్తుంది.

అలాగే ఫస్టాఫ్ లో ఒకే కానీ సెకండాఫ్ లో సినిమా ఇంకా డల్ గా నడుస్తుంది. వీటితో పాటుగా సినిమాలో పెద్దగా ఆకట్టుకునే ఎమోషన్స్ గాని ట్విస్ట్ లు గాని పెద్దగా ఉండవు. దీనితో సినిమా చాలా చోట్ల పేలవంగా అనిపిస్తుంది.

అక్కడక్కడా కార్తీ కామెడి వాటి నుంచి బయట పడేస్తుంది కానీ అది కూడా లేకపోతే సినిమా మరింత బోర్ గా అనిపించవచ్చు. ఇక వీటితో పాటుగా హీరోయిన్ అను ఎమ్మానుయేల్ పాత్ర కి సరైన స్కోప్ కూడా లేదు. చాలా లిమిటెడ్ స్క్రీన్ టైమ్ లోనే కనిపిస్తుంది అలాగే వెళ్ళిపోతుంది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక టెక్నీషియన్ టీం విషయానికి వస్తే.. జివి ప్రకాష్ సంగీతం బాగుంది. తన స్కోర్ పాటలు ఇంప్రెస్ చేస్తాయి. అలాగే రవి వర్మన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కార్తీ కాస్ట్యూమ్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఒకే తెలుగు డబ్బింగ్ ఇంప్రెసివ్ గా చేశారు. ట్రెండీ డైలాగ్స్ బాగున్నాయి.

ఇక దర్శకుడు రాజు మురుగన్ విషయానికి వస్తే.. తాను ఈ సినిమాకి జస్ట్ ఓకే వర్క్ అందించారు అని చెప్పాలి. ఒక్క కార్తీ క్యారెక్టరైజేషన్ మినహా సినిమాలో అంత ఆకట్టుకునే అంశాలు లేవు. అక్కడక్కడా కొంచెం కామెడీ నరేషన్ ని అందించాడు కానీ కొన్ని సీన్స్ ట్విస్ట్ లు ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తాయి. వీటితో మాత్రం తన వర్క్ యావరేజ్ గానే మిగిలిపోతుంది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే.. ఈ “జపాన్” లో కార్తీ మాత్రం మంచి నటనతో ఇంప్రెస్ చేస్తాడు. తన ఫ్యాన్స్ కి కావాల్సిన కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ లతో ఒక సరికొత్త కార్తీ కనిపిస్తాడు అలాగే సినిమాలో అక్కడక్కడా కామెడీ మంచి ఫన్ ని జెనరేట్ చేస్తుంది. ఇక ఇవి మినహా సినిమాలో అంత ఆకట్టుకునే అంశాలు అంతగా ఏమి లేవు. వీటితో అయితే ఈ సినిమా విషయంలో తక్కువ అంచనాలు పెట్టుకొని చూస్తే బెటర్.

 

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు