ప్రస్తుతం ఇండియన్ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమాల్లో ‘రామాయణ’ కూడా ఒకటి. రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా నుంచి మొట్టమొదటి ఐమ్యాక్స్ వెర్షన్ లో తీస్తున్నది కూడా కావడం విశేషం. ఈ పాయింట్ ని మేకర్స్ కూడా గట్టిగా ప్రమోట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ దీపావళి కానుకగా భారీ ఎత్తున విడుదలకి ప్లాన్ చేశారు.
కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మరీ ముఖ్యంగా ఐమ్యాక్స్ స్క్రీన్స్ పరంగా రామాయణ కి జపాన్ నుంచి రాబోతున్న గాడ్జిల్లా సినిమా ఒకటి షాకిచ్చింది. వరల్డ్ వైడ్ తెరకెక్కిన గాడ్జిల్లా సినిమాల క్రేజ్ ఒకెత్తు అయితే జాపనీస్ వెర్షన్ గాడ్జిల్లా క్రేజ్ మరో లెవెల్ అని చెప్పాలి. 2023 లో వచ్చిన మొదటి సినిమా ‘గాడ్జిల్లా మైనస్ వన్’. ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సెట్ చేసింది.
అసలు ఆ సినిమా ఓటిటి రిలీజ్ కోసం గాని కనీసం పైరసి వెర్షన్ లో అయినా సరే చూడాలి అనే లెవెల్ క్రేజ్ ని ఆ సినిమా సొంతం చేసుకుంది. అంతే కాకుండా బెస్ట్ విజువల్స్ జాబితాలో ఆస్కార్ కూడా గెలుపొందింది. ఇప్పుడు అలాంటి సినిమాకి కొనసాగింపుగా వస్తున్న తదుపరి సినిమా ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ పట్ల కూడా ఊహించని లెవెల్ క్రేజ్ నెలకొనగా ఈ సినిమా కూడా జపాన్ నుంచి తెరకెక్కుతున్న మొదటి ఐమ్యాక్స్ వెర్షన్ సినిమాగా కన్ఫర్మ్ చేశారు.
ఇది ఇప్పుడు రామాయణ కి పెద్ద ట్విస్ట్ అని చెప్పి తీరాలి. ఆల్రెడీ గాడ్జిల్లా ముందు సినిమాకి పాన్ వరల్డ్ లెవెల్లో భారీ క్రేజ్ ఉంది. ఇప్పుడు ఐమ్యాక్స్ వెర్షన్ కూడా అంటున్నారు పైపెచ్చు రామాయణ రిలీజ్ టైం నవంబర్ 6న గాడ్జిల్లా కొత్త సినిమాని ఖరారు చేశారు. సో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఆడియెన్స్ లో కానీ ఐమ్యాక్స్ అత్యధిక స్క్రీన్స్ పొందడంలో కానీ గాడ్జిలా మైనస్ జీరో కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇది రామాయణ మేకర్స్ కి ఊహించని షాక్ అని చెప్పవచ్చు. మరి నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ క్లాష్ ని ఎలా నెట్టుకొస్తారో చూడాలి.


