“జాతి రత్నాలు” మరో స్ట్రాంగ్ ఫిగర్స్.!

Published on Mar 21, 2021 6:12 pm IST

ఈ ఏడాది తెలుగు సినిమా వద్ద ప్రతీ నెల కోసం ఒక్కో చిత్రం సాలిడ్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి లోను చేసింది. అలా జనవరిలో మాస్ మహారాజ్ “క్రాక్” ఫిబ్రవరిలో వైష్ణవ్ తేజ్ డెబ్యూ చిత్రం “ఉప్పెన” మరి ఈ మార్చ్ లో నవీన్ పోలిశెట్టి నటించిన “జాతి రత్నాలు” భారీ వసూళ్లతో విజయ ఢంకా మోగించింది.

సాలిడ్ ప్రమోషన్స్ తో అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే మంచి వసూళ్లను అన్ని చోట్లా రాబట్టుకుంది. చిన్న బడ్జెట్ తో చిన్న టార్గెట్ పెట్టుకొని వచ్చిన ఈ చిత్రం సునాయసంగా బ్రేకీవెన్ అయ్యి అదరగొట్టింది. మరి అలాగే ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం యూఎస్ వసూళ్లు ఏకంగా 1 మిలియన్ మార్క్ ను టచ్ చేయనుండగా మరో పక్క ఓవరాల్ గా ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా టచ్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి మాత్రం జాతి రత్నాల రీసౌండ్ గట్టిగానే వినిపించింది అని చెప్పాలి. మరి ఈ చిత్రంలో నవీన్ తో పాటుగా రాహుల్ రామకృష్ణ అలాగే ప్రియదర్శిలు మరో కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంతో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా రీఎంట్రీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :