ఒకరోజు లేట్ గా రానున్న “జాతి రత్నాలు”.?

Published on Apr 7, 2021 4:00 pm IST

ఈ ఏడాది తెలుగు బాక్సాఫీస్ దగ్గరకు వచ్చిన పలు చిత్రాల్లో ప్రతీ నెలలో బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒక్కో సినిమా ఉంది. మరి అలా గత మార్చ్ నెలలో సాలిడ్ ప్రమోషన్స్ నడుమ విడుదలై అంతకు మించిన స్థాయిలో హిట్ కాబడిన చిత్రం “జాతి రత్నాలు”. టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా సందీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది.

అయితే సిల్వర్ స్క్రీన్ పై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం స్ట్రీమింగ్ లోకి ఎప్పుడు వస్తుందా అని కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులను దక్కించిన ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం మొదట ఈ ఏప్రిల్ 10న స్ట్రీమింగ్ కు వస్తుంది అని తెలిసింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఓ రోజు లేట్ గా ఈ చిత్రం ఏప్రిల్ 11న స్ట్రీమింగ్ కు రానుందట. మరి ఓటిటిలో కూడా మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన ఈ చిత్రం అదే సమయానికి వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :