‘జాతిరత్నాలు’కు సీక్వెల్.. ఎప్పుడు.. ఎక్కడ ?

Published on Apr 22, 2021 1:30 am IST

లాక్ డౌన్ అనంతరం టాలీవుడ్ చూసిన విజయాల్లో ‘జాతిరత్నాలు’ ఒకటి. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాల్ని చూపెట్టింది. డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారట. నవీన్ పోలిశెట్టి, నిర్మాతలు కూడ సీక్వెల్ పట్ల ఆసక్తిగా ఉన్నారట. మొదటి భాగంలో పొట్టకూటి కోసం ముగ్గురు కుర్రాళ్లు హైదరాబాద్ వస్తే ఈసారి మాత్రం అమెరికా వెళ్తారట. సీక్వెల్ కోసం కావాల్సిన లైన్ కూడ రెడీగా ఉందట.

ఇది కూడ ‘జాతిరత్నాలు’ తరహాలోనే పూర్తిస్థాయి ఫన్ ఎంటర్టైనరేనట. ఇందులో కూడ నవీన్ పొలిశెట్టితో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ఉండబోతుంది అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక దర్శకుడు అనుదీప్ ఈ సీక్వెల్ కంటే ముందు నవీన్ పొలిశెట్టితో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇది పూర్తిగా కొత్త కథ.

సంబంధిత సమాచారం :