ఒకప్పటి హీరోయిన్, రాజకీయ నాయకురాలు అయిన జయప్రద వెండి తెర ఒక వెలుగు వెలిగారు. కాగా ఇప్పుడు ఆమె త్వరలో బుల్లితెర ప్రేక్షకులను కూడా తన నటనతో అలరించబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే హిందీలో ప్రసారమవబోయే ‘పర్ఫెక్ట్ పతి’ షోలో ఆమె ఓ ముఖ్యమైన పాత్ర చేయనున్నారు.
ఈ షోలో జయప్రద తల్లి పాత్రలో కనిపించనున్నారు. ధైర్యవంతమైన మహిళగా ఆమె పాత్ర ఉండనుంది. బుల్లితెర పై నటిస్తుండటం పై జయప్రద మాట్లాడుతూ తన జీవితంలో వచ్చిన ఈ కొత్త కోణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని, ఐతే టీవీ మాధ్యమం ఎంతో శక్తివంతమైన మాధ్యమం అని, ధైర్యవంతమైన మహిళా పాత్రను తనకు పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
