బీజేపీలో చేరిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ !

Published on Mar 26, 2019 11:40 am IST

ఒకప్పటి స్టార్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు అయిన జయప్రద వెండి తెర ఒక వెలుగు వెలిగి.. ఆ తరువాత రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగారు. కాగా ఇప్పుడు ఆమె మళ్ళీ రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు. గతంలో కొన్ని పార్టీల్లో పనిచేసిన ఆమె.. ఇప్పుడు తాజాగా బీజేపీలో చేరారు.

కాగా ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి జయప్రద పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీలో ఆమె తన ప్రభావాన్ని ఎంతవరకూ నిలుపుకుంటారో చూడాలి.

ఇక ప్రస్తుతం జయప్రద కొన్ని సినిమాలతో పాటు ఇటీవలే ఓ మెగా సీరియల్ లోనూ నటిస్తోంది.

సంబంధిత సమాచారం :