మహర్షి కి తల్లిగా సహజ నటి !

jayasudha

మహేష్ నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’లో ఆయనకు తల్లి పాత్రలో సీనియర్ నటి జయప్రద నటిస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలు అబద్దం అని తేలింది. ఎందుకంటే ఆ పాత్రలో సహజ నటి జయసుధ నటిస్తుందట. ఈవిషయాన్ని ఆమెనే స్వయంగా ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో చెప్పారు.

ఇక మహేష్ కు తండ్రి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు రానుంది.

Exit mobile version