వచ్చే ఏడాది పవన్‌తో సినిమా పక్కా అంటున్నారు

Published on Apr 21, 2021 3:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ శరవేగంగా సాగుతోంది. ‘వకీల్ సాబ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల మధ్యకు వచ్చిన వెంటవెంటనే సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇంకోక సినిమాను రిలీజ్ చేయాలనే యోచనలో ఉన్నారు. ప్రజెంట్ చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ఈ సంవత్సరమే రిలీజవుతుంది. క్రిష్ ‘హరిహర వీరమల్లు’ 2022 సంక్రాంతికి వస్తుంది. ఈమధ్యలో హరీష్ శంకర్ సినిమా మొదలుపెడతారు ఆయన. ఇవే కాకుండా ఇంకొన్ని సినిమాలను చర్చల దశలో ఉంచారు.

త్వరలో అవి కూడ ఫైనల్ కానున్నాయి. వాటిలో ఒకటి జె.బి. ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఉండే అవకాశం ఉంది. ఈ సంస్థ నిర్మాతలు జె. భగవాన్, పుల్లారావులకు ఇండస్ట్రీలో మంచి నిర్మాతలుగా గుర్తింపు ఉంది. వీరికి పవన్‌తో సినిమా చేయాలనే కోరిక ఉంది. ఇందుకోసం మంచి కథను కూడ రెడీ చేసుకున్నారు. ఈ ఏడాది మొత్తం పవన్ బిజీ కాబట్టి వచ్చే ఏడాదిలో తమ సినిమా తప్పకుండా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు నిర్మాత పుల్లారావు. సో.. 2022లో పవన్ సైన్ చేయనున్న సినిమాల్లో ఆల్రెడీ ఒకటి కన్ఫర్మ్ అయినట్టే అనుకోవాలి.

సంబంధిత సమాచారం :