మా కుమార్తె సినిమాల్లోకి రావట్లేదు – జీవిత

Jeevitha-Rajasekhar
టాలీవుడ్ ప్రముఖ హీరో, హీరోయిన్లు రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివాని త్వరలో సినీ రంగ ప్రవేశం చేయనుందని వార్తలొచ్చాయి. వారాహి చలన చిత్రం నిర్మాణంలో యంగ్ హీరో నాగ శౌర్య సినిమాతో ఆమె డెబ్యూట్ ఉంటుందని అన్నారు. కానీ తాజాగా ఈ వార్తలపై స్పందించిన జీవిత తమ కుమార్తె ఇప్పుడే హీరోయిన్ గా రావడంలేదని తెలిపారు. అలాగే ఏదైనా మంచి స్క్రిప్ట్ ఉంటే ఆలోచిస్తామని కూడా అన్నారు.

అదే విధంగా వారాహి బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి కూడా నేను నాగ శౌర్యతో సినిమా చేస్తున్న మాట నిజమే, ఆ సినిమాకి నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడు. కానీ జీవిత-రాజశేఖర్ కుమార్తె ఇందులో హీరోయిన్ కాదు. అసలు ఇంకా హీరోయిన్ ను డిసైడ్ చేయలేదు అన్నారు. ఇకపోతే ప్రస్తుతం శివాని మెడిసిన్ చదువుతోంది.