బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన జీవిత రాజశేఖర్ !

Published on Feb 4, 2019 7:12 pm IST

ఈ రోజు పుట్టిన రోజును జరుపుకున్నాడు సీనియర్ హీరో రాజశేఖర్. అయితే ఓ వ్యక్తి తమని బెదిరిస్తున్నాడని జీవిత రాజశేఖర్ దంపతులు బంజారాహిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో పిర్యాదు చేశారు. కౌశిక్ అనే వ్యక్తి అనవసరంగా తమని బెదిరిస్తున్నారని అతని పై చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ దంపతులు ఫిర్యాదు చేశారు. అయితే అతను అసలు ఎందుకు బెదిరిస్తున్నారో అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వస్తోన్న ‘కల్కి’ సినిమా టీజర్ ఈ రోజు విడుదలై నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి గరుడవేగ చిత్రం లాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్‌ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :