హీరో నాని, అమలా పాల్ నటించిన ‘జెండా పై కపిరాజు’ త్వరలో విడుదలకు సిద్ధంగావుంది. తమిళ వెర్షన్ ఫ్లాప్ అవ్వడం, ఫైనాన్షియల్ కారణాల వలన ఈ సినిమా వాయిదాపడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుందని సమాచారం.
అన్నీ సజావుగా సాగితే ఈ చిత్రం జూలై చివరి వారంలో విడుదలకానుంది. సముద్రఖని దర్శకుడు. నాని ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. జి.వి ప్రకాష్ సంగీతదర్శకుడు. శ్రీనివాస్ నిర్మాత


