మార్చి 21న నాని జెండాపై కపిరాజు

మార్చి 21న నాని జెండాపై కపిరాజు

Published on Mar 8, 2015 12:28 PM IST

Jendapai-kapiraju1
యంగ్ హీరో నాని మొట్ట మొదటి సారి డ్యూయల్ రోల్ చేస్తూ, అమలా పాల్, రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘జెండాపై కపిరాజు’. గత సంవత్సర కాలంపై నుంచే ఈ సినిమా రిలీజ్ కోసం డేట్స్ అనౌన్స్ చెయ్యడం, అవేమో వాయిదా పడడం కామన్ గా జరుగుతోంది. దాంతో నాని ఈ సినిమాని పక్కన పెట్టి తన తదుపరి సినిమాని కూడా పూర్తి చేసాడు. ఇప్పుడు తన తాజా సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ రిలీజ్ కి దగ్గర పడుతున్న టైంలో మళ్ళీ ‘జెండా పై కపిరాజు’ తెరపైకి వచ్చింది.

ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని ఉగాది కానుకగా మర్చి 21న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. అన్ని కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సముద్ర ఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని చేస్తున్న మయ కన్నన్ పాత్రకి సంబందించిన లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు