యంగ్ హీరో నాని మొట్ట మొదటి సారి డ్యూయల్ రోల్ చేస్తూ, అమలా పాల్, రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘జెండాపై కపిరాజు’. చాలా కాలంగా ఈ సినిమాకి రిలీజ్ డెట్లు అనౌన్స్ చెయ్యడం, అవేమో వాయిదా పడడం కామన్ గా జరుగుతోంది.గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ చిత్ర టీం ఇటీవలే ఓ ప్రెస్ మీట్ పెట్టి సినిమాని ఆగష్టు లో రిలీజ్ చేస్తామని అందుకోసం ఆగష్టు 8వ తేదీని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. అందరూ ఆగష్టు 8న ఈ సినిమా విడుదలై పోతుందని అనుకున్నారు.
కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగష్టు 8న విడుదల కావడం లేదు. ప్రస్తుతానికి ఆగష్టు చివరి వారానికి వాయిదా పడింది. త్వరలోనే కచ్చితమైన రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సముద్ర ఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని చేస్తున్న మయ కన్నన్ పాత్రకి సంబందించిన లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.


