జెర్సీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుందట !

Published on Feb 9, 2019 1:40 am IST

నాని తన కెరీర్ లో మొదటి సారిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నటిస్తున్న ‘జెర్సీ’. ఈ సినిమా ఇటీవల షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. వెటరన్ రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరీ ని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈచిత్రం క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుందని టాక్. ఈచిత్రంలో నాని మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని కి జోడీగా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. తెలుగులో ఆమె కు ఇదే మొదటి చిత్రం. ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :