ఆరవ సారి 1మిలియన్ క్లబ్ లో చేరిన నాని !

Published on Apr 24, 2019 8:13 am IST

నాని నటించిన తాజా చిత్రం జెర్సీ ఓవర్సీస్ లో సత్తా చాటుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ చిత్రం 5 రోజుల్లో ఈ చిత్రం $1,032,572 గ్రాస్ వసూళ్లను రాబట్టి ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. ఈ ఫీట్ సాధించడం నాని కి ఇది ఆరోసారి. ఇంతకుముందు నాని నటించిన ఈగ , భలే భలే మగాడివోయ్ . నేను లోకల్ , నిన్నుకోరి, ఎంసీఏ 1మిలియన్ మార్క్ ను క్రాస్ చేశాయి.

ఈ చిత్రాల తరువాత నాని నటించిన కృష్ణార్జున యుద్ధం , దేవదాస్ ఓవర్సీస్ లో అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు జెర్సీ తో నాని మళ్ళీ అక్కడ తన సత్తా చాటుతున్నాడు. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం 2 మిలియన్ క్లబ్ లో చేరుతుందో లేదో చూడాలి. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :