రామ్ చరణ్ కోసం ‘జెర్సీ’ డైరెక్టర్ ?

Published on Apr 23, 2019 9:33 pm IST

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’. క్లాసిక్ హిట్ టాక్ తో ఈ సినిమా ప్రముఖుల ప్రశంసల అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరికి అయితే ఏకంగా సినిమా అద్భుతంగా తీశాడంటూ ఈ మధ్య కాలంలో ఏ దర్శకుడికి రానంత విశేషమైన పేరే వచ్చింది. కాగా ప్రసుతం గౌతమ్ తిన్ననూరి తన తరువాత సినిమాను సెట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

గౌతమ్ తిన్ననూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఎప్పుడో ఓ కథను రాసుకున్నాడట. ఆ కథను ఇప్పుడు చరణ్ కు వినిపించాలని ప్రయత్నిస్తోన్నాడు. మరి కథ చెప్పడానికి గౌతమ్ రెడీగా ఉన్నా.. చరణ్ ఇప్పుడు సినిమా చేస్తాడా ? పోనీ రాజమౌళి భారీ మల్టీస్టారర్ తరువాత అయిన గౌతమ్ కు ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి. మొత్తానికి నాని కెరీర్ లో బెస్ట్ మూవీని ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి.. చెర్రీకి కూడా అలాంటి మూవీనే ఇస్తాడేమో చూద్దాం.

సంబంధిత సమాచారం :