జెర్సీ ,కాంచన 3 & మజిలీ ,చిత్రలహరి లేటెస్ట్ కృష్ణా కలెక్షన్స్ !

Published on Apr 26, 2019 10:39 am IST

నాని జెర్సీ కి లారెన్స్ కాంచన 3 నుండి పోటీ తప్పడం లేదు. మెదటి వారాంతం ఈరెండ్లు సినిమాలు నువ్వా నేనా అన్నట్లు గా బాక్సాఫీస్ వద్ద పోటీపడగా వీక్ డేస్ లోకూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. జెర్సీ ఏ సెంటర్లలో మంచి రన్ ను కొనసాగిస్తుండగా బిసి సెంటర్ల ప్రేక్షకులు మాత్రం పెద్దగా కనెక్ట్ కాలేకపోతున్నారు. కాంచన 3 ఏ సెంటర్లలో తేలిపోగా బిసి సెంటర్లలో హావ కొనసాగిస్తోంది.

ఇక ఈ రెండు సినిమాల కలెక్షన్ల విషయానికి వస్తే కృష్ణా లో నిన్న జెర్సీ 5.97 లక్షల షేర్ తో 7రోజుల్లో 1.05 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయగా కాంచన 3 నిన్న 4.44 లక్షల షేర్ తో 7రోజుల్లో 97.83 లక్షల షేర్ ను రాబట్టిందని సమాచారం. ఇక ఈ సినిమాలకన్నా ముందు విడుదలైన మజిలీ, చిత్రలహరి అక్కడ రన్ ను ముగించనున్నాయి.

మజిలీ నిన్న కృష్ణా లో 61,970 షేర్ తో మూడు వారాల్లో 1.77 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వగా చిత్రలహరి మాత్రం పూర్తిగా నిరాశ పరుస్తుంది. కృష్ణాలో నిన్న ఈ చిత్రం 3,910 షేర్ తో రెండు వారాల్లో 75.08 లక్షల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది.

సంబంధిత సమాచారం :