‘జెర్సీ’ ‘కాంచన 3’ కృష్ణా లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Apr 22, 2019 1:18 pm IST

గౌతమ్ దర్శకత్వంలో నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ మరియు రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వేదిక, ఓవియా ముఖ్య పాత్రల్లో ముని సిరీస్ లో భాగంగా హారర్ కామిక్ థ్రిల్లర్ గా వచ్చిన కాంచన 3 కృష్ణా జిల్లాలో బాక్సాఫీస్ వద్ద బాగానే పోటీ పడుతున్నాయి.

ముఖ్యంగా బి. సి కేంద్రాలలో ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి కఠినమైన పోటీనే ఎదుర్కొంటున్నాయి. ఇక కృష్ణా జిల్లాలో ఈ రెండు చిత్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ కింద విధంగా ఉన్నాయి.

ఆదివారం కృష్ణా జిల్లాలో జెర్సీ 23.03 లక్షల షేర్ ని రాబట్టగా.. మొదటి మూడు రోజులకుగానూ రూ. 76.79 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. మరో వైపు కాంచన 3 కూడా ఆదివారం నాడు 22.69 లక్షల షేర్ ను సాధించింది. ఈ చిత్రం మూడు రోజులకుగానూ రూ. 69.20 లక్షల షేర్ ను రాబట్టింది.

సంబంధిత సమాచారం :