జెర్సీ ,కాంచన 3 లేటెస్ట్ కృష్ణా , గుంటూరు కలెక్షన్స్ !

Published on Apr 24, 2019 12:40 pm IST

గత శుక్రవారం విడుదలైన నాని జెర్సీ సూపర్ పాజిటివ్ రివ్వ్యూస్ ను తెచ్చుకోగా లారెన్స్ కాంచన 3 యావరేజ్ రివ్యూస్ ను తెచ్చుకుంది. అయితే అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జెర్సీ ఎంత రాబడుతుందో కాంచన 3 కి కూడా అంతే రాబడుతూ ఊహించనటువంటి పోటీనిస్తుంది. జెర్సీ కి ఏ సెంటర్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండగా కాంచన 3 కి బిసి సెంటర్ల ప్రేక్షకులను అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అసలు జెర్సీ కి వచ్చిన టాక్ కు ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కు సంబంధం లేన్నట్టుగా అనిపిస్తుంది. అంతలా డ్యామేజ్ చేసింది కాంచన 3. యూఎస్ లో మాత్రం జెర్సీ పర్వాలేదనిపిస్తుంది.

ఇక ఈ రెండు సినిమాల కలెక్షన్ల విషయానికి వస్తే నిన్న గుంటూరు లో జెర్సీ 9.30లక్షల షేర్ తో 5రోజుల్లో కోటి రూపాయలషేర్ ను కలెక్ట్ చేయగా కాంచన 3 నిన్న 9లక్షల షేర్ తో 5రోజుల్లో 97.5 షేర్ ను రాబట్టింది. కృష్ణా లో నిన్న జెర్సీ 8.7 లక్షల షేర్ తో 5రోజుల్లో 96లక్షల షేర్ ను కలెక్ట్ చేయగా కాంచన 3 నిన్న 8.22లక్షల షేర్ తో 5రోజుల్లో 87.71 లక్షల షేర్ ను రాబట్టిందని సమాచారం. ఈ కలెక్షన్లను బట్టి చూస్తూనే అర్ధమవుతుంది బాక్సాఫీస్ వద్ద జెర్సీ కి కాంచన 3 ఎలాంటి పోటీనిస్తుందోనని.

సంబంధిత సమాచారం :