సమీక్ష : జెర్సీ – అర్జున్ ఎమోషనల్ జర్నీ

Published on Apr 20, 2019 3:05 am IST
Jersey movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు : నాని, శ్రద్ధ శ్రీనాథ్, సత్యరాజ్, రావు రమేష్

దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి

నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ

సంగీతం : అనిరుద్ రవిచందర్

సినిమాటోగ్రఫర్ : సను వర్గీస్

ఎడిటర్ : నవిన్ నూలి

ఈ సమ్మర్ లో విడుదలవుతున్న చిత్రాల్లో మంచి హైప్ తెచ్చుకున్న సినిమా జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

అర్జున్ (నాని) క్రికెటర్ 26 సంవత్సరాల వయసు లో ఉన్నపుడు కొన్ని కారణాల వల్ల క్రికెట్ ను వదిలేస్తాడు. ఆ తరువాత ఆర్ధిక సమ్యసల వల్ల అలాగే తన కొడుకు కోసం 36 యేన్ల వయసులో క్రికెట్ ఆడడం మొదలు పెడుతాడు అర్జున్. ఈక్రమంలో అతను ఎలాంటి పరిస్థులను ఎదుర్కున్నాడు? ఇంతకి అర్జున్ నేషనల్ టీంలో సెలక్ట్ అయ్యాడా ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ..

ప్లస్ పాయింట్స్ :

నో డౌట్ సినిమా కు మెయిన్ పిల్లర్ గా నిలిచాడు నాని. తన సహజమైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో కళ్ళతో పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. యంగ్ & మిడిల్ ఏజ్డ్ గా సినిమా లో వన్ మ్యాన్ షో చేసాడు.

రంజీ టీం లో ఎంపికైనా తరువాత రైల్వే స్టేషన్ లో వచ్చే సన్నివేశాల్లో నాని నటన అద్భుతం. సినిమా విడుదలకు ముందు నాని కాన్ఫిడెంట్ చూసి కొంచం ఆశర్యం అనిపించింది. కానీ సినిమా చూసాక నాని ఆలా ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది . అలాగే క్రికెట్ సన్నివేశాలు కూడా చాలా సహజంగా అనిపిస్తాయి. లైవ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ చూస్తన్నామనే ఫిలింగ్ కలుగుతుంది.

ఇక సినిమా లో నాని తరువాత సారా , నాని, కోచ్ పాత్రలు గుర్తుండిపోతాయి. సారా పాత్రలో కన్నడ బ్యూటీ శ్రద్ద శ్రీనాథ్ చాలా బాగా నటించింది. కోచ్ పాత్రలో సత్యరాజ్ , నాని పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నటన కూడా బాగుంది.

ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తో మంచి మెసేజ్ ఇవ్వడం లో డైరెక్టర్ గౌతమ్ సకెస్స్ అయ్యాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం, ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చెయ్యడం వంటి విషయాల్లో గౌతమ్ తన ప్రతిభ చుపెట్టుకున్నాడు. అలాగే డైలాగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా విజయం లో కీ రోల్ ప్లే చేశాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా కు మెయిన్ మైనస్ అంటే సినిమా అక్కడడక్కడ స్లొ అవ్వడమే. ఇక సెకండ్ హాఫ్ ను కూడా కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది. ఈ చిత్రం పూర్తి ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కడంతో అందరికి కనెక్ట్ కాకపోవచ్చు.

ఇక సినిమా లో పెద్దగా ట్విస్టులు లేకపోవడం ఊహాజనితంగా ఉండండం కూడా మైనస్ గా చెప్పొచ్చు.

సాంకేతిక విభాగం :

స్పార్స్ డ్రామా కు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి సినిమాను అందరు మెచ్చే విధంగా తెర మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. అసలు ఈ సినిమా కు నాని ని హీరోగా తీసుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాడు. తన టేకింగ్ కు నాని నటన తోడవడంతో తన రెండవ ప్రయత్నంలో సూపర్ సక్సెస్ అయ్యాడు గౌతమ్. త్వరలోనే ఈ డైరెక్టర్ ఏస్ మేకర్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ఇక డైరెక్టర్ తరువాత సినిమా కు ప్లస్ అయ్యాడు అనిరుద్. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. చిన్న చిన్న సన్నివేశాలను కూడా తన మ్యూజిక్ తో ఎలివేట్ చేసాడు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమా ను కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది . సినిమాటోగ్రఫీ బాగుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

తీర్పు :

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ జెర్సీ లో నాని నటన , కథ , క్లైమాక్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అవ్వగా సినిమా అక్కడక్కడ స్లో అవ్వడం మైనస్ గా చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం క్రికెట్ ను ఇష్ట పడే వారికి అలాగే ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది మరి మాస్ ప్రేక్షకులు ఈ సినీమా ను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక చివరగా ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ అవుతుందో తెలియదు కాని నాని కెరీర్ లో ఈ జెర్సీ బెస్ట్ మూవీ గా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :