జెర్సీ యూఎస్ లో నాని కి సెకండ్ బిగ్గెస్ట్ హిట్ కానీ .. !

Published on Apr 30, 2019 8:14 am IST

నాచురల్ స్టార్ నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ ఓవర్సీస్ లో మంచి వసూళ్లును రాబడుతుంది. ఈచిత్రం సెకండ్ వీకెండ్ లో $141k వసూళ్లతో 10రోజుల్లో అక్కడా 1.23 మిలియన్ డాలర్లను రాబట్టింది.దాంతో ఈచిత్రం నాని కెరీర్లో సెకండ్ బిగెస్ట్ హిట్ గా నిలిచింది. కాగా భలే భలే మగాడివోయ్ 1.43 మిలియన్ డాలర్ల వసూళ్లతో మొదటి స్థానంలో వుంది. అయితే జెర్సీ ఫుల్ రన్ లో 1.5 మిలియన్ మార్క్ ను క్రాస్ చేయడం కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటె ఈ చిత్రానికి హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ నుండి తీవ్రమైన పోటీ ఎదురవుతుంది.

ఇక ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం ఊహించిన రేంజ్ లో వసూళ్లను రాబట్టలేకపోతుంది. కేవలం ఏ సెంటర్లలో మాత్రమే మంచి రన్ ను కనబరుస్తుడడంతో ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపించడం లేదు. ఈమధ్య కాలంలో మహానటి తరువాత అంతటి గొప్ప రివ్యూస్ ను రాబట్టుకున్న జెర్సీ వసూళ్ల విషయంలో మాత్రం అంచనాలను అందుకోలేకపోతుంది.

సంబంధిత సమాచారం :